భారత్ సమాచార్.నెట్, మెదక్: శివంపేట మండలంలోని పోతారం, గంగాయిపల్లి, పెద్దగొట్టుముక్కుల, తాళ్లపల్లి తండా గ్రామాల్లో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. పీఏసీఎస్ ఛైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మద్దతు ధరకు తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో  మధు యాదవ్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

కాటన్ కాపాస్ యాప్‌పై అవగాహన