భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా పెద్దకడబురు గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు చిరంజీవి నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న తన వేతనాలను వెంటనే చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నప్పటికీ జీతాలు సమయానికి అందక కుటుంబ పోషణ తీవ్రంగా కష్టమైందని వాపోయారు. అప్పులు చేసి ఇంటి అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్యపై పంచాయితీ కార్యదర్శి, సంబంధిత అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన స్పందన లేకపోవడం బాధాకరమని తెలిపారు. కనీస వేతనాలు…
పెండింగ్ వేతనాలు చెల్లించాలి





