భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆలూరు నుండి ఎల్లార్తి గ్రామానికి వెళ్లే రహదారి అత్యంత దుర్దశగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని బీసీవై పార్టీ కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ ఎల్లార్తి అర్జున్ వాల్మీకి జిల్లా కలెక్టర్ డాక్టర్ అట్టా సిరి ఐఏఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత పంచాయతీ రాజ్ ఎస్‌ఈకి రహదారుల పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక సంవత్సరం క్రితం ప్రారంభించిన రోడ్ల మరమ్మతు పనులను కాంట్రాక్టర్లు…