YogaAndhra-PM Modi: యోగాంధ్ర గిన్నిస్ రికార్డుపై ప్రధాని మోదీ హర్షం

భారత్ సమాచార్.నెట్: ఏపీలోని కూటమి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణం వేదికగా 3.01లక్షల మందితో ఆర్కే బీచ్‌లో ఏకకాలంలో యోగాసనలు వేయడంతో యోగాంధ్ర 2025 కార్యక్రమం గిన్నిస్ రికార్డు వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుంకుంది. గతంలో గుజరాత్ పేరుపై ఉన్న ఈ రికార్డును ఆంధ్రప్రదేశ్ అధిగమించింది.
అయితే ఇదే సమయంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థుల చేసిన సూర్య నమస్కారాలకు గాను మరో గిన్నిస్…




