భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది పాఠశాల నుంచి 150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాన్ని సాధించారు. పాఠశాల చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచింది. మండల స్థాయిలో గోటిముకల అక్షయ 560 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, శెట్టి మేఘన 556 మార్కులతో ద్వితీయ స్థానం, రాగుల లిప్సిక 553…