భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పాపన్నపేట,టేక్మాల్ మండలం చంద్రు తాండ పోలింగ్ సరళిని సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ పరిశీలించారు. ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతున్న సందర్భంలో సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు టేక్మాల్ మండలం చంద్రుతాండాలో ప్రజలందరూ 80% ఓటు హక్కు వినియోగించుకోవడం అభినందన నియమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.