భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: చిన్నారులకు ప్రీ ప్రైమరీ స్థాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్పంచి మాదరి ప్రశాంత్ సూచించారు. నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి అంగన్వాడీ కేంద్రాలు-1, 2లను సూపర్‌వైజర్ నీరజతో కలిసి ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోని నిర్వహణ, చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
ప్రభుత్వం సరఫరా చేసిన ఏకరూప దుస్తులను చిన్నారులకు పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. చిన్నారుల హాజరు,…





