భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ డంపు యార్డులో ఇతర ప్రాంతాల కంపెనీల నుంచి చెత్త పారపోస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. డంపు యార్డ్ నుంచి వెలువడే దుర్గంధం, పొగ వల్ల శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, అదేవిధంగా గురుకుల విద్యార్థులు, సీతారాంపూర్, పాపియ తండవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.






