భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని మండలంలోని 16 గ్రామాలను పెద్దహరివాణం మండలంలో కలపాలని ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సర్పంచులు, ఎంపీటీసీలు కర్నూలు కలెక్టర్ డా. ఏ.సిరిని శుక్రవారం కలిశారు. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని, కొన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు కూడా జరిగాయని వివరించారు. గ్రామాలను ఆదోని మండలంలోనే కొనసాగించాల్సిన అవసరాన్ని వివరించి వినతిపత్రం సమర్పించారు. సర్పంచులు, ఎంపీటీసీలు స్థానికుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తూ, నిర్ణయం పునఃవిచారణ చేయాలని కోరారు.