భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లా ఏర్పాటు జరిగేంతవరకు నిరసనలు ఏ విధంగానూ ఆగవని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. అరెస్టులతో ఉద్యమాలను అణచగలనన్న ప్రభుత్వ భ్రమ తప్పని నాయకులు వ్యాఖ్యానించారు. తమ డిమాండ్ నెరవేరే వరకు భారీ స్థాయిలో ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతాయని విద్యార్థి సంఘ నాయకులు ఉదయ్, శ్రీనివాస్ తదితరులు హెచ్చరించారు. ప్రజలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియజేయాలని వారు పిలుపునిచ్చారు.