భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారత కమ్యూనిస్టు ఉద్యమ మహానేత, ప్రజా నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు మాట్లాడుతూ.. పుచ్చలపల్లి సుందరయ్య జీవితాంతం పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సామాజిక సమానత్వం, శ్రమజీవుల సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు నేటి తరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.…