భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జిల్లాలో మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. అధిక పెట్టుబడులు పెరిగినప్పటికీ, ప్రైవేట్ వ్యాపారులు కేవలం రూ.1300 నుంచి రూ.1500 మాత్రమే చెల్లిస్తున్నారని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2450 అమలు కాకపోవడంతో రైతులు క్వింటాల్‌కు రూ.900 నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు…