భారత్ సమాచార్ సిద్ధిపేట జిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామంలో ఊరంకి లక్ష్మి ఇంటి వద్ద ఆదివారం 9 అడుగుల కొండచిలువను గ్రామస్తులు గుర్తించారు. వెంటనే ఎల్కతుర్తి పోలీసులకు సమాచారం అందించడంతో, పాములు పట్టే శ్రీధర్ అనే యువకుడి సహాయంతో దానిని పట్టుకున్నారు. వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుందని, రైతులు వ్యవసాయ బావుల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఎల్కతుర్తి సీఐ రమేష్, ఎస్సై ప్రవీణ్, కానిస్టేబుల్ రాజు, గణేష్ తెలియజేశారు.
మరిన్ని కథనాలు:





