భారత్ సమాచార్, వెబ్డెస్క్: మహిళలు నెలసరి సమయంలో శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. పొత్తికడుపు నొప్పి, నడుంనొప్పి, అలసట, మూడ్ మార్పులు ఇవన్నీ రోజువారీ పనులను కూడా కష్టంగా మారుస్తాయి. ఈ సమయంలో ఆహారంలో రాగులను చేర్చుకోవడం సహజమైన ఉపశమనం అందించే మార్గాల్లో ఒకటి.
రాగుల్లో ఉండే పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిలో ఉన్న కాల్షియం గర్భాశయ కండరాలను సాంత్వనపరుస్తుంది, కండరాల సంకోచాలను నియంత్రిస్తుంది. ఈ కారణంగా నెలసరి సమయంలో వచ్చే క్రాంప్స్ తగ్గే అవకాశం ఉంటుంది. పాలు కాకుండానే…





