భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఓ కానిస్టేబుల్ పై అత్యాచారం కేసు నమోదైంది. బయ్యారం ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్ పరిధిలోని దినేష్ అనే కానిస్టేబుల్, మండలానికి చెందిన ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తన కుటుంబ గొడవల దృష్ట్యా కానిస్టేబుల్ ఆసరా తీసుకుని మాయమాటలతో మోసం చేశాడని పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని కథనాలు: 

విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలు మెరుగుపరచాలి