భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: జిల్లాలో ఓ కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసు నమోదయ్యింది. బయ్యారం ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ పరిధిలోని దినేష్ అనే కానిస్టేబుల్, మండలానికి చెందిన ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కుటుంబ గొడవలతో ఆసరా కోసం తనను ఆశ్రయించిన మహిళను కానిస్టేబుల్ మాయమాటలతో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.
మరిన్ని కథనాలు





