భారత్ సమాచార్.నెట్, విశాఖపట్నం: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పౌర సరఫరాల శాఖ సరికొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇకపై స్పాట్‌లోనే బియ్యాన్ని పరీక్షించేందుకు వీలుగా 700 మొబైల్ కిట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మొబైల్ కిట్‌లో పరీక్షించినప్పుడు బియ్యం ఎరుపు రంగులోకి మారితే, అవి రేషన్ బియ్యంగా నిర్ధారించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. గతంలో పట్టుకున్న బియ్యాన్ని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ…
బియ్యం అక్రమ రవాణా గుర్తించేందుకు రాపిడ్ కిట్స్: మంత్రి





