భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ గురువారం నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఎలక్షన్ నామినేషన్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. నామినేషన్ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారికి, హెల్ప్ డెస్క్ సిబ్బందికి తగు సూచనలు చేసి, నామినేషన్ పత్రాలను స్వీకరించు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకోవాల్సిందిగా ఆదేశాలు జారి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మధులత పాల్గొన్నారు.