భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పనిచేసిన 13 మంది కార్మికులు మరణించడంతో, వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో AITUC,IFTU ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. సంఘీభావంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ కాసిం వల్లి, NSUI నేతలు వీరేష్ యాదవ్, ఆసిఫ్, షబ్బీర్, లోకేష్, షాకిర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
మృత కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాల కోసం రిలే నిరాహార దీక్ష



