భారత్ సమాచార్.నెట్, కృష్ణా జిల్లా : గుడివాడ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో ప్రజల నుంచి సమస్యల అర్జీలను ఆయన స్వీకరించారు. ప్రజల వినతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే, వెంటనే సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
ప్రజల న్యాయబద్ధమైన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా శ్రేయస్సే సీఎం చంద్రబాబు…





