భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు శివకుమార్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియను పరిశీలించిన అనంతరం శివకుమార్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అదేవిధంగా నర్సాపూర్ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మన్నే వీరేశం మృతిచెందిన విషయం తెలుసుకున్న…





