భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు చేగుంట పోలీస్ స్టేషన్ లో చేగుంట పోలీసుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ చేగుంట మరియు ఐశ్వర్య ఐ కేర్, చేగుంట వారి సహకారంతో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరము ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పలువురు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.