భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ప్రజలకు పారదర్శక పాలన అందించడంలో సమాచార హక్కు చట్టం (RTI) కీలకపాత్ర వహిస్తుందని కర్నూలులోని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేయడానికి ఆర్టీఐ దోహదపడుతుందని, ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవాలని వక్తలు సూచించారు.
అడ్వకేట్ రవికుమార్ దరఖాస్తు విధానాన్ని వివరించారు. లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయి…





