భారత్ సమాచార్.నెట్, మెదక్: ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు సమాచార హక్కు (RTI) చట్టం, 2005 ఒక మైలురాయి చట్టంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

ఈ చట్టం గురించి పౌరులలో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుంచి 12 వరకు ఆర్టీఐ వారోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు. ఈ వారంలో జిల్లా కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, మండల ప్రధాన కార్యాలయాల్లో అన్ని విభాగాలలో ఆర్టీఐ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.