భారత్ సమాచార్, నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెకు గతంలో విద్యార్థులుగా ఉన్న ఇద్దరు మైనర్లు ఈ ఘటనకు పాల్పడినట్లు దర్యాప్తులో నిర్ధారించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్లు తెలిపారు. రూపా రెడ్డి చివరిసారిగా తన పిన్నితో మాట్లాడుతూ ‘బాబు’ అని సంబోధించినట్లు గుర్తించిన…