భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నందికొట్కూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి నివాసంలో ‘రైతన్నా… మీ కోసం’ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సీఎం నారా చంద్రబాబు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ, మెకనైజేషన్, ప్రకృతి వ్యవసాయం, ఆధునిక టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడి సాయం వంటి…
రైతుల మేలుకోసమే ‘రైతన్నా… మీ కోసం’





