భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలు ఆదివారం అందోలు నియోజకవర్గంలోని జోగిపేట పట్టణంలో వైభవంగా జరిగాయి. భాద్రపద అమావాస్యతో తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో చివరి రోజున సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. రాజరాజేశ్వర ఆలయం, పోచమ్మ దేవాలయం, ప్రభుత్వ మందిరాల వద్ద రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఉంచి, బతుకు ముచ్చట్ల పాటలు ఆలపిస్తూ మహిళలు లయబద్ధంగా ఆటలాడారు. చిన్న, పెద్ద, ధనిక, పేద అనే భేదం లేకుండా అందరూ ఒకచోట…