భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతుల పొలాలకు వెళ్లాల్సిన విద్యుత్ తీగలను కింది స్థాయి సిబ్బంది అమ్ముకున్న ఘటన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపింది. డీసీ బార్ సమీపంలోని ఓ నూతన వెంచర్ యజమానితో కుమ్మక్కైన కొందరు ట్రాన్స్‌కో సిబ్బంది, నిబంధనలకు విరుద్ధంగా 11 కేవీ అల్యూమినియం వైర్లను తొలగించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగు భూములకు వెళ్లే విద్యుత్ స్తంభాల నుంచి వైర్లను తొలగించడంతో సాగునీటి సరఫరా నిలిచిపోయిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు…