భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : సాలురా మండలంలో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఆరు వాహనాలను అధికారులు పట్టుకున్నారు. ఇందులో నాలుగు ట్రాక్టర్లు, రెండు ఆటోలు ఉన్నాయి. మంధర్నా వద్ద ఈ దాడులు నిర్వహించినట్లు మండల తహసీల్దార్ శశిభూషణ్ తెలిపారు.
పట్టుకున్న వాహనాలను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నప్పటికీ, అధికార యంత్రాంగం నుంచి సరైన స్పందన కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై రూరల్ ఎస్ఐ మచ్చేందర్…





