భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు భూపాలపట్నం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. గ్రామ సర్పంచ్ తొలేం స్వప్న ఆధ్వర్యంలో అంతర్గతంగా ఉన్న డ్రైనేజీలను శుభ్రం చేయించడంతో పాటు రోడ్లపై పేరుకుపోయిన మట్టిని జెసిబి సహాయంతో సోమవారం తొలగించారు.గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన సర్పంచ్ స్వప్న, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గ్రామస్తులు పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి చెత్త ట్రాక్టర్‌కు అందజేయాలని సూచించారు.తెలంగాణ ప్రభుత్వం…