భారత్ సమాచార్ నెట్, నిజామాబాద్ : బోధన్ మండలం నాగన్‌పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ మచ్కూరి వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పిల్లల హాజరు, వారికి అందుతున్న పోషకాహార నాణ్యతను పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలపై ఆరా తీస్తూ రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం ఉర్దూ ప్రాథమిక పాఠశాల వసతులను సమీక్షించి, గ్రామ ప్రధాన రహదారిపై దుమ్ము సమస్యను నివారించేందుకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని చల్లించారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ గ్రామ మౌలిక వసతుల…





