భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థి పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లికుదురు మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం ఎస్ఎప్ఐ అధ్యక్ష, కార్యదర్శిలు ఇసంపేల్లి పవన్, బానాల నవీన్ లు మాట్లాడుతూ.. భారత విద్యార్థి ఫెడరేషన్ 1970లో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో, అధ్యయనం -పోరాటం నినాదంతో ఏర్పడి నేడు దేశంలోనే 30 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఆవిర్భవించిందన్నారు. దేశంలో ని విద్యార్థుల సమస్యల పరిష్కారానికై పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో వంశి, అఖిల్,…