భారత్ సమాచార్.నెట్, కర్నూలు: జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయని, సెలవుల్లో సైతం తరగతులు నిర్వహిస్తున్నాయని SFI జిల్లా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యార్థులను పాఠశాలలో ఉంచడం వల్ల వారు శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని SFI నాయకుడు శ్రీనివాస్ తెలిపారు.

ఈ నేపథ్యంలో, ఇలాంటి సంస్థల యాజమాన్యాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీనివాస్ సోమవారం స్పెషల్ కలెక్టర్ అనురాధకు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల…