భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఆదోని మండలం, పెద్దహరివానం బాలుర బీసీ హాస్టల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న కీలక సమస్యను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తక్షణమే పరిష్కరించారు. స్టడీ హాల్‌లో బ్లాక్‌బోర్డ్ లేకపోవడంతో చదువులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లోకేష్, రవి, అలీ భాష దృష్టికి తీసుకువచ్చారు.

వార్డెన్‌కి ఎన్నిసార్లు తెలియజేసినా స్పందన కరువైన నేపథ్యంలో, నాయకులు వెంటనే స్పందించి విద్యార్థులకు కొత్త బ్లాక్‌బోర్డ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ.. విద్యా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలతో పాటు సేవా…