భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల శీతల మాత నల్లపోచమ్మ దేవాలయంలో ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఉదయం నుంచి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి, కోటి పుష్పాలతో పుష్పాలంకరణ చేశారు. శ్రీ శ్రీ మాదానంద సరస్వతి స్వామి వారి ప్రవచనాలు, సాయంత్రం అమ్మవారి ప్రధాన వీధుల గుండా ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
శీతలమాత నల్లపోచమ్మ జాతర మహోత్సవాలు





