భారత్ సమాచార్, (ఇనుగుర్తి), మహబూబాబాద్ జిల్లా: ఇటీవల నిర్వహించిన సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన బొల్లు సహస్ర అసాధారణ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికై ఢిల్లీలో జరిగిన క్రీడల్లో పాల్గొంది. ప్రజాపాలన విద్యా వారోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరిష్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, డీఈవో ఏ.సత్యనారాయణలు ఆమె తల్లిదండ్రులు బొల్లు సురేష్ సుభాషిణిల సమక్షంలో మెమెంటో అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. సాఫ్ట్‌బాల్‌లో జాతీయస్థాయిలో రాణించడం పట్ల…