భారత్ సమాచార్, పగో జిల్లా: భీమవరంలో దారుణం జరిగింది. కన్న తల్లి, తోడబుట్టిన తమ్ముడిని దారుణంగా హత్య చేసాడు ఓ దుండగుడు. పట్టణానికి చెందిన శ్రీనివాస్ తల్లి, తమ్ముడిని గంట పాటు కత్తితో పొడిచి చంపేశాడు. హత్య అనంతరం రోడ్డుపైకి వచ్చిన శ్రీనివాస్ మాట్లాడిన మాటలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాయి. ‘మా అమ్మ, తమ్ముడు మనుషులు కాదు దెయ్యాలు. నన్ను పీక్కుతింటున్నారు. వాళ్ల కడుపులో ఎన్నిసార్లు పొడిచినా చావట్లేదు. నా మనసులో ఏం అనుకున్నా వాళ్లకు తెలిసిపోతోంది. నాకు పిచ్చి అంటున్నారు’ అని…