భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సీఎం కప్ సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు మెదక్ జిల్లా కేంద్రంలోని స్థానిక అవుట్‌డోర్ స్టేడియంలో ప్రారంభించారు. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి విచ్చేసిన సుమారు 700 మంది క్రీడాకారులు క్రీడోత్సవాలలో పాల్గొన్నారు. జిల్లా యువజన, క్రీడల అధికారి మెదక్ జిల్లా రమేష్ గంగాల కార్యక్రమానికి సభాధ్యక్షత వహించారు. క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం.నగేష్ విచ్చేసి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేందర్,…