భారత్ సమాచార్.నెట్, వనపర్తి: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆసుపత్రిని సందర్శించిన ఆయన, డ్రైనేజ్ పైప్‌లైన్లు మార్చడం, సీసీ రోడ్లు వేయడం వంటి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుకు ఆసుపత్రి వెనుక భాగంలో గదులను సిద్ధం చేసి, అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న డయాలసిస్ సెంటర్‌ను కొత్తగా నిర్మించిన క్రిటికల్…





