భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రాజెక్టు అధికారి రామసుబ్బయ్య హెచ్చరించారు. శనివారం పత్తికొండలో 18వ విడత సామాజిక తనిఖీ బహిరంగ సభ జరిగింది. మండలంలో 1,880 పనులకు రూ.18.62 కోట్ల వ్యయం చేసినట్లు ఎస్ఆర్పి బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా రూ.9,199 రికవరీ చేసి, రూ.8,000 పెనాల్టీ విధించినట్లు జిల్లా విజిలెన్స్ అధికారి షకీలా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: డీపీవో రామసుబ్బయ్య





