భారత్ స‌మాచార్.నెట్, కర్నూలు జిల్లా : ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు నగరం సోమవారం హోరెత్తింది. ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. “జై ఆదోని” నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణాన్ని ముట్టడించిన విద్యార్థులు, పోలీసుల ఆంక్షలను ధిక్కరించి అర్ధనగ్న ప్రదర్శనతో తమ నిరసనను వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా విద్యార్థులు అడుగడుగునా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వెనుకబడిన ఆదోని ప్రాంత అభివృద్ధి…