భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులు పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం కొల్చారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల సామర్ధ్యాలను ప్రశ్నలు జవాబుల రూపంలో పరీక్షించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అక్కడ జరుగుతున్న విద్యాబోధన, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు గుణాత్మకమైన విద్య బోధన అందించడంతోపాటు…