భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: బోధన్ పట్టణంలోని స్వాధర్ గృహంలో వసతి, భద్రతా ఏర్పాట్లను సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సోమవారం జిల్లా సంక్షేమ అధికారి మరియు సీడీపీవో బృందంతో కలిసి పరిశీలించారు. కేంద్రం నిర్వహణ, పునరావాస ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యంగా లబ్ధిదారుల వసతి పరిస్థితులు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
కౌన్సిలింగ్, వృత్తి శిక్షణ, ఆరోగ్య సేవల అమలు తీరును పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. డాక్యుమెంటేషన్, ఫాలోఅప్ ప్రక్రియలను మరింత కచ్చితతరం…





