భారత్ సమాచార్, మెదక్ జిల్లా: లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా రామయంపేట్ మండలం గ్రామం అక్కన్నపేట తాటిపల్లి రాంకీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా తాటిపల్లి రాంకీ ఎన్నుకోగా, ఉపాధ్యక్షునిగా నవీన్ నాయక్, జనరల్ సెక్రటరీగా ప్రవీణ్ రాథోడ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. జిల్లాలోని లైసెన్స్డ్ సర్వేయర్ల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.సర్వేయర్ల సమస్యల పరిష్కారం,…