భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలకమైన జీవోను విడుదల చేసింది. ఈ జీవో ద్వారా సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ల విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి జీవో 46ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని జీవోలో స్పష్టం చేశారు. SC, ST, BC, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనున్నారు.…