భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల: పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, అనుబంధ భీమేశ్వర ఆలయాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
ముఖ్యంగా భీమేశ్వరాలయం సమీపంలో ఏర్పాటు చేసిన స్వామివారికి ప్రీతికరమైన కోడె మొక్కులు భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అభిషేకాలు, గండా దీపం, లింగార్చనలు వంటి పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. ఉసిరిచెట్టు కింద దీపారాధనలు చేశారు. ప్రతి సోమవారం…





