భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాన్ షాప్‌ను తొలగించే విషయంలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ అధికారులు షాప్‌ను ఖాళీ చేయించాలని సూచించగా, పాన్ డబ్బా యజమాని షర్పోద్దిన్‌తో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ అధికారుల వివరాల ప్రకారం.. బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న పాన్ డబ్బాను తొలగించాలని గత ఏడాది నవంబర్ 25న యజమానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు షాప్‌ను ఖాళీ చేయకపోవడంతో జిల్లా స్థాయి ఆర్టీసీ అధికారులు…