భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు విమానాశ్రయం సమీపంలోని ఓర్వకల్లు వద్ద డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ.భరత్ శుక్రవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి యూనివర్సిటీ భవన పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణానికి తన వంతుగా రూ.1 కోటి విరాళం అందజేశానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉర్దూ యూనివర్సిటీతో…