భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కౌతాళం పట్టణంలో వెలసిన పార్వతి దేవి సమేత త్రయంబకేశ్వర స్వామి దేవస్థానం మూడవ సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు. ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ చెన్న బసప్ప, ఆయన సోదరుడు కాశీ విశ్వనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరశైవ లింగాయత్ సంఘం కోరిక మేరకు వరుసగా మూడవసారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద…