భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని పట్టణంలోని అవోపా, వామ్, ఐఐఎఫ్ సంస్థల ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు, యోగివేమన, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శంకర్ నగర్ పురపాలిక ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు దాతల సహకారంతో పలకలు, బలపాలు, పెన్నులు, బుక్కులు, కలరింగ్ కిట్లు పంపిణీ చేశారు అని అవోపా, వామ్ అధ్యక్షులు వంకదారు శ్రీనాథ్ గుప్తా తెలిపారు. యోగివేమన జయంతి సందర్భంగా విద్యార్థులకు వేమన పద్యాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.…